వేసవి కాలంలో జిడ్డు, మొటిమలు, మచ్చలు, ట్యాన్ ఇంకా అలాగే ఫ్రీ రాడికల్స్ నుంచి మీ చర్మాన్ని రక్షించడానికి యాంటీఆక్సిడెంట్స్‌ ఎక్కువగా ఉండే ఆహారాన్ని ఖచ్చితంగా తీసుకోవాలి. విటమిన్ సి, విటమిన్ ఇ సమృద్ధిగా ఉన్న ఆహారాలు చర్మ గాయాలను త్వరగా నయం చేయడంలో, చర్మ స్థితిస్థాపకతను పెంచడంలో సహాయపడతాయి. రాత్రి సరిగ్గా నిద్రపోకపోతే కళ్ల కింద చర్మం డల్ గా కనిపిస్తుంది. కాబట్టి 7-8 గంటల పాటు రాత్రిపూట నిద్ర పోవాలి. మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు, చర్మ సమస్యలను తగ్గించడంలో కూడా నిద్ర సహాయపడుతుంది.మరీ ముఖ్యంగా సన్‌స్క్రీన్ లేకుండా ఎండలో బయటకు వెళ్లకూడదు. సన్‌స్క్రీన్ చర్మానికి హానితలపెట్టే UV కిరణాల నుంచి రక్షిస్తుంది. అలాగే టాన్, సన్ బర్న్ సమస్యలను నివారిస్తుంది. వేసవిలో మాయిశ్చరైజర్ అప్లై చేయడం మర్చిపోకూడదు. చర్మం తేమను కాపాడుకోవడానికి మాయిశ్చరైజర్ ఉపయోగపడుతుంది. ఇది వృద్ధాప్య సంకేతాలను కూడా దూరం చేసుంది. వేసవిలో నూనె లేని మాయిశ్చరైజర్ ఉపయోగించడం మంచిది.


వేసవిలో చెమటలు పట్టడం సహజం. కానీ చెమటను శుభ్రం చేయకపోతే చర్మ సమస్యలు పెరుగుతాయి. కాబట్టి ముఖాన్ని క్రమం తప్పకుండా రెండు మూడు సార్లు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఇది చర్మంపై పేరుకుపోయిన మురికి, నూనె, క్రిములను శుభ్రపరిరచి.. చర్మం తాజాగా కనిపించేలా చేస్తుంది. ఓపెన్ పోర్స్, జిడ్డు చర్మం, మొటిమల సమస్యలు వేసవిలో పెరుగుతాయి. వీటిని వదిలించుకోవడానికి చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయాలి. తేలికపాటి ఎక్స్‌ఫోలియేటర్ ఉపయోగించి చర్మాన్ని స్క్రబ్ చేసుకోవాలి. ఇది చర్మాన్ని చాలా సున్నితంగా, కాంతివంతంగా మారుస్తుంది.వేసవిలో శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి నీటికి మించిన ప్రత్యామ్నాయం మరొకటి లేదు. నీరు ఎక్కువగా తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళ్లిపోతాయి. ఈ ప్రక్రియ రక్తాన్ని శుద్ధి చేస్తుంది. చర్మం స్థితిస్థాపకతను పెంచుతుంది. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచేందుకు నీళ్లతోపాటు ఫ్రూట్ జ్యూస్, పుచ్చకాయ, దోసకాయ వంటి పండ్లను కూడా తినవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: