ముడతలు పడిన చర్మాన్ని సాఫ్ట్ గా మార్చడం కోసం కొన్ని రకాల టిప్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కలబంద, ముల్తానీ మట్టితో చేసిన ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. అలాగే చర్మానికి నూనె అప్లై చేసి మసాజ్ చేసినా మంచి ఫలితం ఉంటుంది. చర్మ ఆరోగ్యం కోసం కూరగాయలు, క్యారెట్, బీట్ రూట్, నట్స్, చేపలు ఎక్కువగా తినాలి. నీళ్లు ఎక్కువగా తాగాలి.చర్మాన్ని సరిగ్గా శుభ్రం చేయకపోవడం అంటే సరిగ్గా స్నానం చెయ్యకుండా ఉండటం, పొల్యూషన్‌లో ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో తిరగడం లేదా గడపడం ఇంకా డిజిటల్ స్క్రీన్ వాడకం వంటి అలవాట్లు  చర్మాన్ని కచ్చితంగా పాడుచేస్తాయి. కాబట్టి కచ్చితంగా మీకు ఆ అలవాట్లు ఉంటే వాటికి చాలా దూరంగా ఉండాలి. ఇంకా అలాగే చర్మ ఆరోగ్యానికి నిద్ర కూడా కచ్చితంగా చాలా అవసరం. మనం తీసుకునే స్కిన్ కేర్ ప్రొడక్ట్స్, మేకప్ ప్రొడక్ట్స్, సబ్బులు, క్రీముల విషయంలో జాగ్రత్త వహించాలి. కొన్ని కెమికల్స్ చర్మాన్ని మరింత పొడిబారేలా చేసే అవకాశం ఉంది. 


కాబట్టి ప్రొడక్ట్స్ విషయంలో జాగ్రత్తవహించాలి. వీలైనంతవరకూ నేచురల్ ప్రొడక్ట్స్ వాడాలి. ముడతలు పడకుండా చర్మం సాఫ్ట్ గా ఎంతో ఆరోగ్యంగా ఉండడానికి హెల్దీ ఫ్యాట్స్ అనేవి కచ్చితంగా చాలా అవసరం. చర్మం సాఫ్ట్ గా ఉండాలంటే డైట్‌లో తప్పకుండా నట్స్, కొబ్బరి, ఆలివ్ ఆయిల్ వంటివి తీసుకోవాలి. అలాగే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కోసం చేపలు కూడా కచ్చితంగా తినాలి. మన చర్మం పాడవ్వడానికి హై షుగర్ కంటెంట్ కూడా ఒక ప్రధాన కారణం. ఎందుకంటే షుగర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మం మృదుత్వాన్ని కోల్పోయి డ్రైగా తయారవుతుంది. కాబట్టి చర్మం ముడతలు పడతున్నవాళ్లు డైట్‌లో కచ్చితంగా చక్కెర శాతాన్ని తగ్గించాలి. మన చర్మానికి కొంత సాగే గుణం ఉంటుంది.చర్మంలో కొవ్వు శాతం తగ్గినప్పుడు, చర్మం పాడయ్యినప్పుడు ఆ సాగే గుణం పోయి చర్మం ముడతలు పడుతుంది. అప్పుడు స్కిన్ టైటెనింగ్ ఎక్సర్‌సైజలు, హెల్దీ డైట్ ద్వారా ఈజీగా ముడతలు తగ్గించుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: