పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలంలో దుద్దుకూరు గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గ్రామంలోని వైన్ షాప్ వాచ్ మెన్ ను గుర్తు తెలియని వ్యక్తులు సజీవ దహనం చేశారు. వైన్ షాప్ దగ్గర నిద్రపోతున్న వాచ్ మెన్ వెంకటేష్ ను పెట్రోల్ పోసి సజీవదహనం చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. వైన్ షాపులోని మద్యం కోసం దుండగులు దారుణానికి ఒడిగట్టారని తెలుస్తోంది. 
 
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో దుద్దులూరు గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పోలీసులు ప్రాథమికంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. లాక్ డౌన్ వల్ల దేశవ్యాప్తంగా మద్యం దుకాణాలు మూతబడ్డాయి. మద్యం కోసమే దుండగులు దారుణానికి పాల్పడ్డారని సమాచారం. 
 
పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు తరువాత వివరాలను మీడియాకు వెల్లడిస్తున్నామని చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: