గత కొంతకాలంగా పాకిస్తాన్ వ్యూహాలు రచిస్తూ భారత్ ను దెబ్బ తీయాలని ప్రయత్నాలు చేస్తోంది. అయితే భారత్ పాక్ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ శత్రు దేశాన్ని చిత్తుచిత్తుగా ఓడిస్తోంది. భారత్ గతేడాది కశ్మీర్ కు ఉన్న స్వయం ప్రతిపత్తిని తీసేసి భారత్ లో అంతర్భాగం అని ప్రకటించింది. అనంతరం భారత్ చట్టాలను సవరించి పాక్ కు షాక్ ఇచ్చింది. దీంతో కశ్మీర్ లో ప్రస్తుతం భారత చట్టాలు అమలవుతున్నాయి. 
 
అయితే తాజాగా పాక్ భారత్ ను దెబ్బ తీయాలనే నెపంతో పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఎన్నికలు నిర్వహించాలని భావించింది. అక్కడ ఎన్నికలు నిర్వహించడం ద్వారా ఆ ప్రాంతం అంతా కూడా తమ చేతిలోనే ఉందని ప్రూవ్ చేయాలని అనుకుంటోంది. తద్వారా ప్రపంచానికి పీవోకే ప్రాంతాన్ని హస్తగతం చేసుకున్నట్టు ప్రూవ్ చేయాలని పాక్ భావిస్తోంది. అయితే ఈరోజు విదేశాంగ మంత్రి జయశంకర్ చేసిన వ్యాఖ్యలతో పాక్ కు భారీగా షాక్ తగిలింది. 
 
పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని చివరి గజం వరకు భారత్ కు వదిలిపెట్టాల్సిందేనని... అక్కడ ఎలాంటి కార్యకలాపాలు జరిగినా అనుమతించేది లేదని అన్నారు. పాక్ ఎత్తుగడకు భారత్ మరో ఎత్తుగడ వేసి భారీ షాక్ ఇచ్చిందని చెప్పవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: