దేశంలో కరోనాను కట్టడి చేయడంలో ఆరోగ్య సేతు యాప్ కీలక పాత్ర పోషిస్తోంది. రోజురోజుకు ఈ యాప్ కు ఆదరణ విపరీతంగా పెరుగుతోంది. కరోనాపై పోరులో ఈ యాప్ కీలకంగా మారింది. రేపటినుంచి ఈ యాప్ జియో ఫోన్లలో కూడా అందుబాటులోకి రానుంది. ఎంపవర్‌డ్ గ్రూప్ 9 చైర్మెన్ అజయ్ సాహ్నీ యాప్ లోని డేటా సంరక్షణ కొరకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని ప్రకటన చేశారు. 
 
నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ ఆరోగ్య సేతు యాప్ ప్రైవసీ గురించి యాప్ యూజర్లు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఎన్‌క్రిప్ట్ అయిన సర్వర్‌లో డేటా దాస్తున్నామని చెప్పారు. అప్‌లోడ్ చేసిన డేటా 45 రోజుల్లో శాశ్వతంగా డిలీట్ ప్రకటన చేశారు. కరోనా రోగుల వివరాలు మాత్రం 60 రోజుల తరువాత డిలేట్ అవుతాయని అన్నారు. ఈ యాప్ ద్వారా ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 20 మధ్య 130 హాట్‌స్పాట్‌లను గుర్తించామని చెప్పారు. బ్లూ టూత్ ఆధారంగా ఈ యాప్ పని చేస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: