దేశంలో కరోనా మమహ్మారిని తరిమి కొట్టేందుకు ఓ వైపు పోలీసులు 24 గంటలూ కాపలా కాస్తూ.. లాక్ డౌన్ ఉల్లంఘన చేయకుండా తమ ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా సేవ చేస్తున్నారు.  ఇందుకు యావత్ దేశం మొత్తం పోలీసులుకు సైల్యూట్ చేస్తుంది.  డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ద్య కార్మికులు కరోనా మహమ్మారి ప్రభావం ఉన్నా తమ ప్రాణాలు ఫణంగా పెట్టి అన్ని విధాలుగా ప్రజలకు సేవ చేస్తున్నారు. అయితే కొన్ని చోట్ల కొంతమంది పోలీసులు అసహనానికి గురి అవుతూ ప్రజలపై లాఠీ ఝులిపిస్తున్నారు.  ఇక లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి వలస కూలీల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది.  ఏటు పోవాలో తెలియని పరిస్థితి నెలకొంది.  ఓ వైపు తమ గమ్యస్థానాలకు చేరుకోవొచ్చని కేంద్రం చెప్పినా కొంత మంది పరిస్థితి మాత్రం ఇబ్బందుల్లోనే ఉంది.   

 

 

లాక్ డౌన్‌లో ఎటుపోవాలో తెలీక బిక్కుబిక్కుంటున్న బడుగుజీవులపై ప్రతాపం చూపుతున్నారు పోలీసులు.  సొంతూరు వెళ్లడానికి పాస్ కోసం పోలీస్ స్టేషన్ వచ్చిన కార్మికులపై పోలీసులు అధికారికి పిచ్చికుక్కలా రెచ్చిపోయాడు. బండబూతులు తిడుతూ వాళ్లపై దాడి చేశాడు. ఓ కార్మికుడిని బూటుకాలితో తన్నాడు.  బెంగళూరులోని కేజీ హోలీ పోలీస్ స్టేషన్ వద్ద  ఈ దారుణం జరిగింది. తమ గమ్య స్థానం చేరుకోవడానికి పోలీసు పర్మిషన్ కోసం వచ్చారు ఉత్తర్ ప్రదేశ్ కి చెందిన కొంత మంది వలస కార్మికులు.  వారికి సమాధనం ఇచ్చే ఓపిక లేదని ఏఎస్‌ఐ రాజా సాహెబ్‌ వారి వెంట పడి తరిమారు.. కాలితో తన్నారు. కార్మికులను బండబూతులు తిట్టి చెయ్యి చేసుకున్నాడు. ఒక కార్మికుడిని బూటుకాలితో తన్నాడు.  ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడతో అతణ్ని సస్పెండ్ చేశారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: