ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి 213 దేశాలకు విస్తరించింది. ప్రతిరోజూ ప్రపంచవ్యాప్తంగా లక్షకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 44,27,900కు చేరగా మృతుల సంఖ్య 2,98,077కు చేరింది. కరోనా నుంచి కోలుకుని 16,57,831 మంది డిశ్చార్జ్ అయ్యారు. 
 
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 24,71,992 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు పలు దేశాల్లో మృతుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. అగ్రరాజ్యం అమెరికాలో 85,197 మంది కరోనా భారీన పడి మృతి చెందారు. స్పెయిన్, రష్యా, యూకే, బ్రెజిల్ తరువాత స్థానాల్లో ఉన్నాయి. మరోవైపు మన దేశంలో కరోనా బాధితుల సంఖ్య 75,000 దాటింది. దేశంలో 24,386 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా 2,415 మంది కరోనా భారిన పడి మృతి చెందారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: