మాజీ విశ్వసుందరి సుస్మితాసేన్ ఒకానొక సమయంలో అరుదైన వ్యాధితో తీవ్ర పోరాటం చేశానని వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్య కాలంలో వర్కౌట్లకు సంబంధించిన వీడియోలను తరచూ సోషల్ మీడియాలో సుస్మిత సేన్ షేర్ చేస్తున్నారు. అయితే తాజాగా తన గత ఆరోగ్య పరిస్థితి గురించి తెలియజేస్తూ ఒక వీడియో షేర్ చేశారు. తాను నుంచాకు ప్రాక్టీస్ వల్ల ఆరోగ్యవంతమైన మహిళగా మారానని ఆమె చెప్పారు. 
 
ఆరేళ్ల క్రితం తాను అడిసన్ వ్యాధితో ఇబ్బంది పడ్డానని... ఆ వ్యాధి వల్ల తన రోగ నిరోధక శక్తి పూర్తిగా దెబ్బ తిందని అన్నారు. అప్పట్లో శరీరం పూర్తిగా నీరసించిపోయిందని... కళ్ల చుట్టూ నల్లని వలయాలు ఏర్పడ్డాయని చెప్పారు. నాలుగేళ్లు ఆ వ్యాధితో ఎలా పోరాటం చేశానో మాటల్లో చెప్పలేనని అన్నారు. అనంతరం ఉత్ప్రేరకాలను తీసుకోవడంతో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయని ఆమె చెప్పారు. ఆరోగ్యవంతంగా మారడానికి నుంచాకు సాధన చేశానని... ఎలాంటి ఉత్ప్రేరకాలు అవసరం లేకుండా సాధారణ స్థితికి వచ్చానని చెప్పారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: