కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను చిగురుటాకులా వణికిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ భారీన పడి మూడు లక్షల మంది మృతి చెందారు. కొన్ని దేశాల్లో వైరస్ తగ్గుముఖం పట్టి మరలా విజృంభిస్తోంది. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు వ్యాక్సిన్ కోసం పలు దేశాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే చాలా దేశాల్లో కరోనా సోకిన వ్యక్తికే మరలా సోకుతోంది. సోకిన వ్యక్తులకే మరలా కరోనా ఉండటంతో వైరస్ ఇప్పట్లో అంతం కాదని వార్తలు వినిపిస్తున్నాయి. 
 
అయితే వైద్యులు మాత్రం ఒకసారి కరోనా భారీన పడిన వ్యక్తికి మరోసారి కరోనా సోకితే ఆ వైరస్ ఇతరులకు వ్యాపించే అవకాశాలు తక్కువని చెప్పారు. కోలుకున్న వ్యక్తుల్లో కరోనాను ఎదుర్కోవడానికి కావాల్సిన యాంటీ బాడీలు సమృద్ధిగా ఉన్నాయని చెబుతున్నారు. కరోనా నుంచి కోలుకున్న వ్యక్తుల నుంచి వైరస్ వ్యాప్తి చెందుతున్నట్టు తాము గుర్తించలేదని వైద్యులు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: