భారత దేశానికి మరో ముప్పు పొంచి ఉంది... మరోసారి మిడతల దండు భారత్పై దాడి చేయనున్నది. ఇప్పటికే చాలాసార్లు మిడతల దండు పాకిస్తాన్ సహా పలు దేశాల నుంచి భారతదేశంలోకి ప్రవేశించి ఇక్కడి పంటలను నాశనం చేసి తీవ్ర నష్టం కలిగించిన విషయం తెలిసిందే. ఇక ఒకసారి మిడతల దండు ప్రవేశించింది అంటే వాటిని నిర్మూలించడానికి అధికారులు నానా తంటాలు పడాల్సి ఉంటుంది. ఎన్నో స్ప్రేలు రసాయనాలు చల్లాలి ఉంటుంది. 

 

 మామూలుగా అయితే మిడతల  సమూహాలు జూన్ మరియు జూలై సమయంలో వస్తూ ఉంటాయి. కానీ ప్రస్తుత సంవత్సరంలో మాత్రం మిడతల  సమూహాలు జూన్ మరియు జూలై సాధారణ సమయం కంటే ముందే భారతదేశంలోకి ప్రవేశించాయి . దీంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. మిడత మొహాన్ని నియంత్రించడానికి రాష్ట్రాలు వివిధ మార్గాలను అనుసరిస్తున్నాయి. ఈ విషయాన్ని అధికారికంగా పర్యావరణ అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖ వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: