ఆంధ్రప్రదేశ్ కరోనా బాధితుల సంఖ్య, కరోనా మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. కరోనా నిర్ధారణ అయిన వారికి ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స అందిస్తుండగా కరోనా అనుమానితులను క్వారంటైన్ కేంద్రాలలో ఉంచి పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. వారిలో కరోనా లక్షణాలు కనిపిస్తే పరీక్షలు జరిపి కరోనా సోకిందో లేదో నిర్ధారిస్తున్నారు. అయితే తాజాగా క్వారంటైన్ కేంద్రంలో పాడైపోయిన ఆహారం పెడుతున్నారంటూ కాకినాడ జేఎన్టీయూ క్వారంటైన్ సెంటర్‌లో కరోనా అనుమానితులు ఆందోళనకు దిగారు. 
 
పాడైపోయిన ఆహారం పెడుతూ తమ జీవితాలతో ఆడుకుంటున్నారని.... పాజిటివ్ నిర్ధారణ అయిన వారిని, తమను ఒకే క్వారంటైన్ కేంద్రంలో ఉంచుతున్నారంటూ అధికారులతో, సిబ్బందితో అనుమానితులు ఆందోళనకు దిగారు. ఒకే క్వారంటైన్ కేంద్రంలో 200 మందిని ఉంచారని... తమకు మౌలిక వసతులు కల్పించడం లేదని చెబుతున్నారు. 


 

మరింత సమాచారం తెలుసుకోండి: