దేశంలో లాక్ డౌన్ విధించడంతో సామాన్యులు, పేదలు ఇళ్లకే పరిమితమైన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో జగన్ సర్కార్ రాష్ట్రంలో ఉచితంగా బియ్యం, కందులు పంపిణీ చేస్తోంది. తాజాగా ఐదో విడత ఉచిత సరుకుల పంపిణీకి సీం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్రంలో ఈ నెల 29 లేదా 30వ తేదీ నుంచి ఐదో విడత రేషన్ పంపిణీ మొదలు కానుంది. టైం స్లాట్ కూపన్ల ద్వారా బియ్యం పంపిణీ జరగనుందని తెలుస్తోంది. 
 
ప్రభుత్వం ఒక్కొక్కరికి 5 కిలోల బియ్యం, కిలో కందిపప్పు ఉచితంగా ఇవ్వనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 29,000 రేషన్ షాపులు ఉండగా ప్రభుత్వం వాటికి అదనంగా 15,331 కౌంటర్లు ఏర్పాటు చేసి సరుకులు పంపిణీ చేయనుంది. తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎక్కడ ఉంటే అక్కడే సరుకులు తీసుకోవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: