దేశంలో కరోనాతో చచ్చిపోతున్నాం రా నయనా అంటే ఇప్పుడు మరికొన్నిఉపద్రవాలు జనాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.  గత నెల విశాఖలో విషవాయువు వల్ల 14 మంది మరణించారు. అంఫాన్ తుఫాన్ తో అతలాకుతలం అయ్యింది.. కోట్ల నష్టం వాటిల్లింది.  ఇప్పటికీ అంఫాన్ తుఫాన్ నుంచి కోలుకోలేదు.. ఇప్పుడు నిసర్గ తుఫాన్ ఒకటి తయారైంది.  ఇది చాలదన్నట్టు మూలిగే నక్కపై తాటిపండు పడినట్టు అయింది ఢిల్లీ పేదల పరిస్థితి. ఇప్పటికే కరోనా మహమ్మారి కారణంగా ఉపాధి కోల్పోయి బిక్కుబిక్కుమంటూ బతుకుతున్న వారి జీవితాలను అగ్ని బుగ్గిపాలు చేసింది. ఢిల్లీలో మెజారిటీ పేదలు నివసించే తుగ్లకాబాద్ మురికివాడలోని వాల్మీకి బస్తీలో బుధవారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం జరిగింది. 

 

వెంటనే ఫైర్ స్టేషన్ కి ఫోన్ చేసినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది.  సమాచారం అందిన వెంటనే 20 అగ్నిమాపక వాహనాలను తీసుకువచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేశామని ఢిల్లీ డివిజనల్ అగ్నిమాపక శాఖ అధికారి ఎస్ కే దువా వెల్లడించారు. ఈ అగ్నిప్రమాదంలో వాల్మీకి బస్తీలోని 200 గుడిసెలు పూర్తిగా కాలిపోయాయి. దీంతో 200 కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. ఈ అగ్నిప్రమాదానికి కారణాలు తెలియలేదు. అగ్నిమాపకశాఖ, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అధికారులు అగ్నిప్రమాద బాధితులకు సహాయ పునరావాస కార్యక్రమాలు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: