తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి వినియోగదారులకు శుభవార్త చెప్పారు. విద్యుత్‌ బిల్లుల చెల్లింపుపై వినియోగదారులకు ఊరట కలిగేలా నిర్ణయం తీసుకున్నారు. మార్చి, ఏప్రిల్‌, మే మాసాలకు జారీచేసిన బిల్లు మొత్తాన్ని 30%, 40%, 30% చొప్పున మూడు వాయిదాల్లో చెల్లించే అవకాశం కల్పిస్తున్నట్టు కీలక ప్రకటన చేశారు. జూన్‌, జూలై, ఆగస్టు నెలల్లో జారీ అయ్యే బిల్లులతో పాటు వీటిని కలిపి కట్టాలని చెప్పారు. 
 
విద్యుత్‌ బిల్లులపై ఫిర్యాదులు వస్తుండటంతో మంత్రి అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆన్‌లైన్‌ చెల్లింపులకు వాయిదాల వెసులుబాటు వర్తించదని అన్నారు. మీటర్‌ రీడింగ్‌, టారిఫ్‌, శ్లాబుల ప్రకారం బిల్లులు జారీ చేసినట్టు ఆయన తెలిపారు. విద్యుత్‌ బిల్లులు మాఫీచేసే యోచన ఏమీ లేదని మరో ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: