ముఖ్యమంత్రి జగన్మోహన్  ప్రజలకు మెరుగైన వైద్యం అందే విధంగా ఆరోగ్యశ్రీ కార్డుల ని తీసుకు వస్తున్న విషయం తెలిసిందే, తాజాగా మీడియా సమావేశం నిర్వహించిన  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీ కార్డు లకు సంబంధించి పలు కీలక వివరాలను వెల్లడించారు, రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీ కార్డు వస్తుందని ఆరోగ్యశ్రీ కార్డు దరఖాస్తు చేసుకున్న 20 రోజుల్లోనే ఆరోగ్యశ్రీ కార్డు  మంజూరు అవుతుంది అంటూ చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యం అంటూ తెలిపారు. 

 

 ఇదే సమయంలో అటు కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లు అధికారులకు హెచ్చరికలు కూడా జారీ చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ప్రజలందరికీ ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ విషయంలో ఎంతో అప్రమత్తంగా... ఎంతో డెడికేషన్ తో ఉండాలి అంటూ సూచించారు. ఆరోగ్యశ్రీ కార్డు కు అప్లై చేసిన వెంటనే ప్రజలందరికీ ఇరవై రోజుల్లో ఆరోగ్యశ్రీ కార్డు తప్పనిసరిగా రావాలని.. అయితే అప్లై చేసిన వారు అర్హులు జాబితా లో ఉండకపోతే  లేదా ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీ కార్డు మాత్రం సత్వరంగా ప్రజలకు అందేలా చూడాలని లేనిపక్షంలో అధికారులపై కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమైంది ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: