దేశంలో కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తోంది. సామాజిక దూరం, మాస్కులు ధరించడం ద్వారా మాత్రమే కరోనా సోకకుండా జాగ్రత్త పడవచ్చు. దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లాలో కూడా భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. జిల్లాలోని క‌సాయీ పాడాకు చెందిన కాసిం అనే 11 ఏళ్ల బాలుడు కరోనా భారీన పడ్డాడు. 
 
బాలుడిని ప్రత్యేక వార్డులో ఉంచి 52 రోజులు ఆసుపత్రిలో చికిత్స అందించినా కాసిం కరోనా నుంచి కోలుకోలేదు. 12సార్లు నిర్వ‌హించిన వైద్య‌పరీక్షల్లో కాసింకు పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో వైద్యులు కూడా బాలుడి ఆరోగ్యం గురించి ఆందోళన చెందారు. అయితే 13వ సారి నిర్వ‌హించిన వైద్య ప‌రీక్ష‌ల్లో క‌రోనా నెగిటివ్ రిపోర్టు రావడంతో వైద్యులు ఊపిరి పీల్చుకున్నారు. 52 రోజుల తరువాత కరోనా నుంచి కోలుకుని ఇంటికి కాసిం చేరుకోవడంతో కుటుంబసభ్యులు సంతోషించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: