హైదరాబాద్ నగరంలో కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తోంది. కరోనా రోగుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు కరోనా పాకింది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న ఏడుగురు పోలీసులకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో పోలీసు శాఖ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఏడుగురు పోలీసులకు కరోనా నిర్ధారణ కావడంతో మిగిలిన సిబ్బందికి పరీక్షలు చేస్తున్నారు. 
 
పోలీసు యంత్రాంగం ప్రైమరీ కాంటాక్టులను సేకరించి అధికారులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. గత వారం హైదరాబాద్‌లోని ప్రభుత్వ హాస్పిటళ్లలో పని చేసిన వైద్య సిబ్బంది కూడా కరోనా బారిన పడ్డారు. తాజాగా పోలీస్ శాఖలో కూడా కరోనా కేసులు బయటపడుతూ ఉండటంతో సిబ్బంది ఆందోళనకు గురవుతున్నారు. రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 4,111కు చేరగా.. యాక్టివ్ కేసుల సంఖ్య 2138గా ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: