ప్రస్తుతం కరోనా  వైరస్ సంక్షోభం కొనసాగుతున్న సమయంలో... ఎయిర్ ఇండియా సంస్థ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. విమానాలు నడపడం ప్రపంచవ్యాప్తంగా ఒంటరిగా ఉన్న ప్రయాణికులను తరలించడం పై ప్రస్తుతం ఎయిర్  ఇండియా సంస్థతో పాటు ఏరియా సిబ్బంది కూడా ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఎయిరిండియా సిబ్బంది... కరోనా  వైరస్ ఇన్సూరెన్స్ కవర్ గురించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు అంతేకాకుండా సంస్థ నుంచి వివరరణ  కూడా కోరారు సిబ్బంది.

 


 విమానంలో కరోనా వైరస్ సంక్రమణకు  గురైతే జీవిత బీమా ఆరోగ్య బీమాకు అర్హులే అయినప్పటికీ తర్వాత విమానం భూమ్మీద ల్యాండ్ అయ్యాక  బీమా నిబంధన  కరోనా  వైరస్ కవర్ చేయదు. అయితే అంతర్జాతీయ తరలింపులో సమయంలో  సిబ్బంది మహమ్మారి వైరస్ బారిన పడుతున్నారని గమనించుకోవాలి అంటూ సంస్థ యాజమాన్యంను  విజ్ఞప్తి చేశారు సిబ్బంది .ఇక  ముంబైకి చెందిన సీనియర్ క్యాబిన్  సిబ్బంది ఎయిరిండియా డిఎండి కి లేఖ కూడా రాసి ఆందోళన వ్యక్తం చేశారు.వెంటనే కరోనా వైరస్ ఇన్సూరెన్స్ కవర్ కు సంబంధించి వివరణ ఇవ్వాలంటూ సిబ్బంది కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: