ఎంతో సరదాగా గడుపుదాం అనుకుంటున్న చిన్నారులను మృత్యువు కబళించింది. స్నేహితులతో కలిసి ఈత కొట్టేందుకు వెళ్ళిన ఆ చిన్నారుల సంతోషాన్ని చూసి విధి వక్రించింది. ఈత కొట్టేందుకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు.
గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. మహేష్ సంతోష్ హుస్సేన్ లు సమీప చెరువులో ఈతకు వెళ్లారు. ఇక అక్కడ లోతు ఎక్కువగా ఉందని ఊహించలేకపోయారు ఆ చిన్నారులు . నీటిలో దిగిన చిన్నారులు ప్రమాదవశాత్తు నీట మునిగి మరణించారు. చిన్నారుల మరణంతో కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి