ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం కరోనా  వైరస్ పోరాటం పై దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జార్ఖండ్ ముఖ్యమంత్రి అయిన హేమంత్ సొరేన్ కి మాట్లాడే అవకాశం రాకపోవడంతో.. తమ ఉద్దేశాన్ని  తాజాగా లిఖితపూర్వకంగా కేంద్రానికి  విన్నవించింది  ఝార్ఖండ్  సర్కార్ . వీడియో కాన్ఫరెన్స్ సమయంలో తమ వంతు రాలేదు కాబట్టి ఇలా లిఖిత పూర్వకంగా తమ  ఉద్దేశాన్ని అంటూ చెప్పుకొచ్చారు. 

 

 ఇక కరోనా ప్రేరిత  ఆర్థిక కష్టాలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ద్వారా... ఆర్థిక సాయం, పేదలందరికీ ధాన్యాల పంపిణీ, పేదలకు నిత్యావసరాలకు డబ్బులకు  కావలసిన నిధులను కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రం ఆశిస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పాండమిక్ స్టేజీలో అందరం కలిసి పోరాడాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: