మెక్సికోలో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రతిరోజూ వేల సంఖ్యలో కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో 5,343 కొత్త కేసులు నమోదు కాగా 1,044 మంది వైరస్ భారీన పడి మృతి చెందారు. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 1,80,545కు చేరగా 21,825 మంది మృతి చెందారు. 
 
మెక్సికో ఆరోగ్య శాఖ ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించింది. అంత‌కుముందు రోజు కూడా మెక్సికోలో క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు పెద్ద సంఖ్య‌లో న‌మోద‌య్యాయి. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటివరకు నమోదైన కేసులతో పోలిస్తే వ్యాధి సోకిన వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉండవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ప్రజలు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ స్థాయిలో కేసులు పెరుగుతున్నాయని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: