తెలంగాణ రాష్ట్రం నుంచి తొలిసారి ఒక గూడ్స్ రైలు దేశ సరిహద్దులను దాటి వెళుతోంది. 42 బోగీల్లో 2,474 టన్నుల పసుపు ఎగమతయింది. నిన్న బయలుదేరిన ఈ రైలు నిజామాబాద్ లో సాగు చేసిన పసుపు పంటను తొలిసారి బంగ్లాదేశ్ కు తీసుకెళుతోంది. నిజామాబాద్‌ కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో పసుపును ఎక్కువగా పండిస్తారు. దక్షిణమధ్య రైల్వే హైదరాబాద్‌ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని పసుపు రైతులతో చర్చలు జరిపి రైలుద్వారా పసుపు రవాణాకు రైతులు సమ్మతి తెలిపేలా చేశారు. 
 
42 బోగీల్లో 2,474 టన్నుల పసుపుతో బయలుదేరిన రైలు ద్వారా రైతులకు రవాణా ఖర్చు తగ్గనుంది. వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు రైల్వే శాఖ రాయితీలు అందిస్తోంది. నిజామాబాద్ జిల్లాలో పండే పసుపు పంటకు బంగ్లాదేశ్ లో మంచి డిమాండ్ ఉంది. ఇప్పటివరకు రోడ్డు మార్గం ద్వారా పసుపు ఎగుమతి జరగగా రైలు మార్గం ద్వారా తక్కువ ఖర్చు అవుతూ ఉండటంతో రైతులు కూడా ఈ మార్గం ద్వారా రవాణాకే మొగ్గు చూపే అవకాశం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: