ప్రపంచంలోని అన్ని దేశాలపై కరోనా వైరస్ పంజా విసురుతోంది. సౌదీ అరేబియాపై కూడా కరోనా ప్రభావం పడటంతో ఈసారి కూడా హజ్ ను నిర్వహించాలని.... తక్కువ మందితో మాత్రమే దాన్ని జరపాలని సౌదీ పాలకులు నిర్ణయం తీసుకున్నారు. సౌదీ అరేబియాలో నివశిస్తున్న వారికి మాత్రమే హజ్ కు హాజరయ్యే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.
ప్రతి సంవత్సరం ప్రపంచ నలుమూలల నుంచి 18 లక్షల మంది హజ్ యాత్రలో పాల్గొంటారు. ఈ సంవత్సరం మాత్రం కేవలం పరిమిత సంఖ్యలో హజ్ యాత్రకు అనుమతించనున్నారని సమాచారం. హజ్ యాత్రతో ప్రతి సంవత్సరం సౌదీ అరేబియా లాభాలు పొందేది. ఈ సంవత్సరం దాదాపు 55,000 కేసులు నమోదు కావడంతో పాటు 1,307 మంది మృతి చెందారు. భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతూ ఉండటంతో సౌదీ పాలకులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
Saudi Arabia to hold ‘very limited’ hajj due to #COVID19 pandemichttps://t.co/CunC6CLmiz pic.twitter.com/hMdoYQr22l
— Hindustan Times (@htTweets) June 23, 2020
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి