కేంద్ర హోం మంత్రి అమిత్ షా ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. 45 సంవత్సరాల క్రితం ఒక కుటుంబం అధికార దాహంతో దేశంలో ఎమర్జెన్సీ విధించిందని పేర్కొన్నారు. ఎమర్జెన్సీ వల్ల దేశం జైలులా మారిందని చెప్పారు. భావ ప్రకటిత స్వేచ్ఛను తొక్కేశారని... మీడియాను, న్యాయస్థానాలను అణచివేశారని వ్యాఖ్యానించారు. అనంతరం ప్రజల ఉద్యమం వల్ల ఎమర్జెన్సీ ఎత్తివేశారని అన్నారు. 
 
జాతీయ ప్రయోజనాలను ఒక కుటుంబానికి పణంగా పెడుతున్నారని పేర్కొన్నారు. ప్రశ్నించే గొంతుకలను కాంగ్రెస్ పార్టీలో తొక్కేస్తున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ తీరుపై ఆ పార్టీ నేతల్లోనే తీవ్ర అసహనం నెలకొందని అన్నారు. ఆ పార్టీలో ఇంకా ఎమర్జెన్సీ మనస్తత్వం ఎందుకుందో ప్రశ్నించుకోవాలని విమర్శించారు. లేకపోతే ప్రజల నుంచి కాంగ్రెస్ మరింత దూరమయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. 

 


 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: