తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత నెచ్చెలి శశికళ ఆగస్ట్ 14న తేదీన జైలు నుంచి విడుదల కానుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె బెంగళూరు పరప్పన అగ్రహారం జైల్లో శిక్షను అనుభవిస్తున్నారు. తమిళనాడుకు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు డాక్టర్ ఆశీర్వాదం ఆమె విడుదల కానుందంటూ ప్రకటన చేశారు. 2016లో ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన కొన్న నెలలకే జయలలిత అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. 
 
ఆ తర్వాత శశికళ ముఖ్యమంత్రి అవుతారని వార్తలు వచ్చినా అక్రమాస్తుల కేసులో దోషిగా తేలడంతో శశికళ సహా ఇరవళసి, సుధాకరన్ లు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత పళనిస్వామి, పన్నీర్ సెల్వం ఇద్దరూ కలిసి ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. శశికళ జైలు నుంచి విడుదలైతే తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తాయని తెలుస్తోంది. అయితే ఆమె నిజంగా విడుదలవుతుందో లేదో చూడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: