భారత్‌లో కొవిడ్‌-19 కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో దేశంలో 19,906 మందికి కొత్తగా కరోనా సోకిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఒక్క రోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. అదే సమయంలో 410 మంది మరణించారు.  ఈ మద్య కరోనా కేసులు ప్రజా ప్రతినిధులకు వస్తున్న విషయం తెలిసిందే. ఎమ్మెల్యేలు, మంత్రులు ఒక్కరేమిటి అందరికి చుట్టేస్తుంది. తాజాగా బిహార్‌కు చెందిన ఓ మంత్రికి కోవిడ్-19 పాజిటివ్ అని తేలిందని స్థానిక వైద్యులు ప్రకటించారు. దీంతో వెంటనే ఆయన కటిహర్‌లో ఉన్న క్వారంటైన్‌లోకి వెళ్లారు. 

 

ఆయన రెండు రోజుల క్రితం ఆయన రాష్ట్ర సచివాలయంలో మీటింగ్ నిర్వహించారు. కొంత మంది సెల్ఫ్ ఐసోలేషన్‌కు వెళ్లేందుకు సిద్ధమయ్యారు.దేశంలో ఇప్పటికే చాలా మంది రాజకీయ వేత్తలకు కరోనా వైరస్ సోకింది.   ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల సంఖ్య 5 లక్షలు దాటింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: