జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్నం జిల్లా పరవాడ ఫార్మా సిటీలో చోటు చేసుకున్న దుర్ఘటనపై తాజాగా స్పందించారు. ఈ ఘటన చాలా బాధాకరమని.... పార్టీ తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు. రాష్ట్రంలో అన్ని రసాయన పరిశ్రమల్లో తక్షణమే సేఫ్టీ అడిట్ చేపట్టాలని ప్రభుత్వాన్ని పవన్ డిమాండ్ చేశారు. ఆసుపత్రిలో ఉన్నవారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. 
 
రసాయన పరిశ్రమల్లో రక్షణ చర్యలు ఎలా ఉన్నాయో ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని చెబుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని అన్నారు. ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనపై ఉన్నతాధికారులతో చేపట్టిన విచారణలో కూడా ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించలేదని వ్యాఖ్యలు చేశారు. నిబంధనలు పాటించకుండా ఉద్యోగులు, సమీప ప్రాంత ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని సూచించారు. మృతి చెందినవారికి ఆమోదయోగ్యమైన పరిహారం ఇచ్చి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని పవన్ కళ్యాణ్ కోరారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: