మోసములు పలు రకములు.. అధిక డబ్బు వస్తుందంటే వెనుకా ముందు చూసుకోకుండా పెట్టుబడులు పెట్టడం.. తీరా తాము మోసపోయామని లబోదిబో అంటూ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం కామన్ అయ్యింది. తాజాగా ఓ రైల్వే ఉద్యోగి కేంద్ర ప్రభుత్వంలో ఓ పథకం ఉందని.. దాంట్లో పెట్టబడి పెడితే బాగా వడ్డీ వస్తుందని గ్రామస్థులను.. స్నేహితులను బురిడీ కొట్టింది ఇప్పుడు చేతులెత్తేశాడు. వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం వెంకటగిరికి చెందిన ఉరుకుందు రైల్వేలో ట్రాక్​మెన్​గా పనిచేస్తున్నాడు. డబ్బులు మీద ఆశతో దొంగదారిలో సంపాదిద్దాం అనుకున్నాడు.

 

ప్రజల అమాయకత్వాన్ని ఆసరగా చేసుకొని  కేంద్ర ప్రభుత్వ పథకం ఒకటుందని.. అందులో లక్ష రూపాయలు కడితే నెలకు రూ. 5 వేలు వడ్డీ వస్తుందని నమ్మబలికాడు. తన ఊర్లోని బంధువులు, స్నేహితులతో దాదాపు రూ. 36 లక్షల వరకు వసూలు చేశాడు.
మొదట్లో సక్రమంగానే వడ్డీ చెల్లించాడు.

 

ఈ ఘరానా మోసగాడు మెల్లి మెల్లిగా తన లీలలు చూపించడం మొదలు పెట్టాడు.  గత కొన్ని నెలలుగా వడ్డీలు ఇవ్వకపోవటంతో గ్రామస్థులు అతన్ని నిలదీశారు. పథకం ఏమీ లేదని తాను ఇప్పుడు డబ్బులు కట్టలేనంటూ చేతులెత్తేశాడు. మోసపోయిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వారు రైల్వే ఉద్యోగిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: