చైనాకు భారత్ వరుస షాకులిస్తోంది. జూన్ 15వ తేదీన చైనా కుట్రపూరితంగా వ్యవహరించి 20 మంది జవాన్లను పొట్టన పెట్టుకోవడంతో భారత్ ఆ దేశం విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది. రెండు రోజుల క్రితం 59 చైనా యాప్ లను నిషేధిస్తూ కీలక ప్రకటన చేసిన కేంద్రం వాటిని గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించడంతో పాటు ఇప్పటికే ఇన్ స్టాల్ అయిన వాటిని కూడా పని చేయకుండా చేసింది. తాజాగా భారత్ భారత్ లోని జాతీయ రహదారుల ప్రాజెక్టుల్లో చైనా కంపెనీలకు అనుమతి లేదని స్పష్టం చేసింది. 
 
మంత్రి నితిన్ గడ్కరీ మీడియాతో మాట్లాడుతూ హైవే ప్రాజెక్టులు, జాయింట్ వెంచర్లలో చైనా కంపెనీలకు అనుమతి ఇవ్వడం లేదని వ్యాఖ్యలు చేశారు. ఆ దేశ భాగస్వామ్యం కలిగిన ఏ జాయింట్ వెంచర్లను కేంద్రం అనుమతించదని పేర్కొన్నారు. దేశంలోని సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల్లో కూడా చైనా పెట్టుబడులకు అనుమతిచ్చే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: