టిడిపి ఎంపీల బృందం తాజాగా ఢిల్లీలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ను కలిశారు. ఈ సందర్భంగా టిడిపి ఎంపీలు అందరూ జగన్ పాలన పై రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్లో 13 నెలల కాలంలో దాడులు ఎంతగానో పెరిగిపోయాయని.. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది అంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. తాము ఇచ్చిన ఫిర్యాదుపై రాష్ట్రపతి సానుకూలంగా స్పందించారని.. తమ పరిధిలో తీసుకోగలిగే చర్యలను పరిశీలిస్తాము అంటూ హామీ ఇచ్చినట్లు టిడిపి ఎంపీలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న తాజా పరిస్థితులు గురించి వివరించడంతో పాటు శాంతిభద్రతలకు కలుగుతున్న విఘాతం గురించి కూడా రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు టిడిపి ఎంపీలు. అంతేకాకుండా టిడిపి ఎంపీల పై అక్రమ కేసులు... మూడు రాజధానులు పేరుతో రాజధాని అమరావతి ఖ్యాతిని తగ్గించడం... ప్రభుత్వ పథకాల్లో జరుగుతున్న అవినీతి సహా మరికొన్ని అంశాలపై రాష్ట్రపతికి ఇచ్చిన ఫిర్యాదులో టీడీపీ ఎంపీలు పేర్కొన్నట్లు ఎంపీ కనకమేడల తెలిపారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి