ఇటీవలే ప్రఖ్యాత ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానంలో వరుసగా అర్చకులు కరోనా వైరస్ బారిన పడుతున్న విషయం తెలిసిందే . రోజురోజుకు తిరుపతి ఆలయం లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. అయితే రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో తాజాగా దీనిపై రమణదీక్షితులు స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా టీటీడీ అధికారుల పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
శ్రీవారి ఆలయంలో విధులు నిర్వహించిన అర్చకులు ఏకంగా 15 మంది కరోనా వైరస్ బారిన పడ్డారని... ఇంకా 25 మందికి చెందిన ఫలితాలు రావాల్సి ఉంది అంటూ ఆయన వ్యాఖ్యానించారు. అయినప్పటికీ కూడా భక్తులు దర్శనాల నిలిపివేసేందుకు టిటిడి అధికారులు నిరాకరిస్తున్నారని.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాటించిన విధానాలనే టీటీడీ అధికారులు ఇంకా పాటిస్తున్నారు అంటూ విమర్శలు గుప్పించారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించకపోతే ఉపద్రవం చోటు చేసుకుంటుందని రమణదీక్షితులు వ్యాఖ్యానించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి