కరోనా కాలంలో ఇంగ్లాండ్​ గడ్డపై జరిగిన తొలి అంతర్జాతీయ మ్యాచ్​లో ఆల్​రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది వెస్టిండీస్. తొలి టెస్టులో గెలిచి ఇంగ్లీష్ జట్టుకు షాకిచ్చింది. అందుకు బదులు తీర్చుకునేందుకు సిద్ధమైంది ఇంగ్లాండ్. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు మాంచెస్టర్ వేదికగా ప్రారంభమైంది. వర్షం కారణంగా ఆలస్యమైన టాస్​లో గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది కరీబియన్ జట్టు.

 


మొదటి టెస్టుకు దూరమైన ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ ఈ మ్యాచ్​కు అందుబాటులోకి వచ్చాడు.. అలాగే ఐసీసీ కరోనా నిబంధనలు అతిక్రమించినందుకు ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్​ ఈ మ్యాచ్​కు దూరమయ్యాడు.ఓపెనర్లుగా వచ్చిన రోరీ బర్న్స్, డొమినిక్ సిబ్లే ఆచితూచి ఆడుతున్నారు. 10 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లాండ్ వికెట్ నష్టపోకుండా 17 పరుగులు చేసింది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: