బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఈ నెల 8న ఆనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా ఆ వైరస్ సోకిందేమోననే అనుమానంతో కరోనా పరీక్షల కోసం ఆయన్ని లీలావతి ఆసుపత్రికి వెళ్లగా అక్కడ ఆయన లంగ్ క్యాన్సర్ బారిన పడ్డ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం సంజయ్ స్టేజ్-3 ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. త్వరలో అమెరికాకి వెళ్లి వైద్యం చేయించుకోనున్నట్టు వార్తలు వచ్చాయి.
కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన అక్కడికి వెళ్ళడం లేదని, ముంబైలోనే జాయిన్ అవుతున్నాడని చెబుతున్నారు. ఈరోజు ఆయన ఇంటి నుండి ముంబైలోని కోకిలాబెన్ హాస్పిటల్ కి వెళుతున్న ఫోటోలు బయటకొచ్చాయి. ఆయన ఆసుపత్రికి వెళ్తూ చేయి కూడా ఊపారు. అలానే ఆయన ప్రే ఫర్ మీ, అంటే నా కోసం ప్రార్దించండి అని వారిని కోరినట్టు సమాచారం.