మన దేశానికి
కరోనా వైరస్ తెచ్చిన మార్పులు అన్నీ ఇన్నీ కావు. కొన్ని చెప్పుకోలేనివి కూడా ఉన్నాయనుకోండి. అయితే ఈ కరోనా ప్రతి ఒక్కరి జీవన శైలిని పూర్తిగా మార్చివేసిందని చెప్పచ్చు. ఒకప్పుడు ఇండియాలో ప్రైవేట్ బస్ ట్రావెల్ రంగం ఒక మంచి
బిజినెస్,
ఆర్టీసీ సేవలకు ధీటుగా... ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు నడుస్తుండేవి. కొన్ని రూట్లలో అయితే ప్రైవేట్ బస్సులు మాత్రమే నడుస్తుండేవంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. లాక్ డౌన్ లో పూర్తిగా షెడ్ల కు మాత్రమే పరిమితమైన బస్సులు లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత క్రమంగా సర్వీసులు ప్రారంభించాయి.
అన్ని చోట్లా ఇంకా ప్రైవేట్ ట్రావెల్స్ కి ఇంకా అనుమతులు ఇవ్వలేదు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఇంట్రా - స్టేట్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఒక్క మహారాష్ట్రలో తప్ప. అక్కడ కేసులు భారీగా ఉండడంతో ఇప్పటిదాకా బస్సులకి అనుమతులు ఇవ్వలేదు. అయితే రేపటి నుండి జిల్లాల మధ్య బస్సు సర్వీసులు నడపనున్నట్టు ఆ రాష్ట్ర రవాణా శాఖా
మంత్రి అనిల్ పరబ్ పేర్కొన్నారు. అయితే ప్రైవేటు బస్సులు, వాహనాల మీద ఆంక్షలు కొనసాగుతాయన్న ఆయన పాస్ లేకుండా తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.