తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అనే సామెత భలే సరిపోతుంది అనుకుంట మన రాజకీయ నాయకులకి. ప్రెస్ మీట్లలో ఎన్ని తిట్టుకుంటారో ఒకరినొకరు కలిస్తే అంత ఆత్మీయంగా కౌగిలించుకుంటారు. చిరు రాజకీయాల్లో ఉన్నప్పుడు తెగ విరుచుకు పడిపోయిన రోజా ఈరోజు చిరంజీవి బర్త్ డే కావడంతో ఆయనకు విషెస్ చెప్పింది.

అది కూడా స్వయంకృషితో మెగాస్టార్ గా ఎదిగి ఎందరో నటులకు ఆదర్శంగా నిలిచిన మా చిరు గారికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ ఓన్ చేసేసుకుంది. నిజానికి వీరిద్దరూ కలిసి కొన్ని సినిమాలు చేశారు. ముగ్గురు మొనగాళ్లు, ముఠామేస్త్రి, బిగ్ బాస్ సినిమాలలో రోజా చిరంజీవి సరసన హీరోయిన్ గా నటించడం జరిగింది. ఆ తర్వాత ఇంకెప్పుడూ వీళ్లిద్దరూ కలిసి నటించలేదు. ప్రస్తుతం రోజా ఒక పక్క బుల్లితెరపై అలరిస్తూనే మరో పక్క రాజకీయాలు కూడా చేస్తోంది. ఏపీలో ఆమె పార్టీ అధికారంలో కూడా ఉంది. వీలు చిక్కినప్పుడల్లా పవన్ ని కూడా ఒక ఆట ఆడుకుంటూ ఉంటుంది ఈమె.

మరింత సమాచారం తెలుసుకోండి: