దేశ వ్యాప్తంగా కరోనా వేగంగా ప్రబలుతున్న ఈ తరుణంలో ఎటువంటి సమావేశాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇవ్వలేదు. ఇప్పటికే ఎండాకాల అసెంబ్లీ, పార్లమెంటు సమావేశాలను వాయిదా వేశారు. అయితే ఇప్పుడు వర్షాకాల పార్లమెంటు సమావేశాలను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే కరోనా వేగంగా ప్రబలుతున్న ఈ తరుణంలో పార్లమెంటులో అందరూ ఒకే చోట కూర్చోడం ఒకే చోట సమావేశం అవ్వడం ప్రమాదకరం అని అందరూ భావిస్తున్నారు.
 

కరోనా ప్రబలకుండా పార్లమెంటులో  ఎంపి లు కూర్చునే సీట్లలో మార్పులు చేసినట్టు పార్లమెంటు అధికారులు వెల్లడించారు. కొత్తగా ఇప్పుడు పార్లమెంటు సమావేశాలకు హాజరు అయ్యే ప్రతి ఒక్కరూ సమావేశాలకు 72 గంటల ముందే కరోనా పరీక్షలు చేపించుకోవాలి అని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ట్విటర్ ద్వారా తెలిపారు.  ఈ నిర్ణయంతో పార్లమెంటు ఎంపి లు అందరూ కరోనా పరీక్షలకు సిద్దమవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: