కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేయాలని, గత తీర్పును సమీక్షించాలని కోరుతూ.. ఆరు విపక్ష అధికార రాష్ట్రాల మంత్రులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుప్రీం తీర్పు విద్యార్థుల జీవించే హక్కును హరిస్తోందని.. కరోనా వేళ పరీక్షల నిర్వహణతో వచ్చే ఇబ్బందులను విస్మరిస్తోందని పేర్కొన్నారు.
సుప్రీం ధర్మాసనంలోని న్యాయమూర్తులు జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ క్రిష్ణ మురారిలు ముందుగా పిటిషన్ను తమ ఛాంబర్స్లో పరిశీలిస్తారు. పిటిషనర్లు లేవనెత్తిన అంశాల్లో విచారించాల్సిన విషయాలు ఉన్నాయని తెలితే.. నేరుగా విచారించే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు.ఈ పిటిషన్ను బంగాల్ నుంచి మొలోయ్ ఘటక్, ఝార్ఖండ్ నుంచి రామేశ్వర్ ఓరావున్, రాజస్థాన్ నుంచి రఘు శర్మ, ఛత్తీస్గఢ్ నుంచి అమర్జీత్ భగత్, పంజాబ్ నుంచి బీఎస్ సిద్ధు, మహారాష్ట్ర నుంచి ఉదయ్ రవీంద్ర సావంత్లు దాఖలు చేశారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి