దేశంలో ప్రతి రోజు ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఎవరో చేసిన నిర్లక్ష్యానికి మరెవరో బలి అయినట్లు ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఒక్క రోడ్డు ప్రమాదం వల్ల ఎన్నో కుటుంబాలు పెద్ద దిక్కు కోల్పోవడం.. అనాథలుగా మిగలడం చూస్తూనే ఉన్నాం. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వాలు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా ఈ ప్రమాదాలను మాత్రం అరికట్టలేకపోతున్నారు.
తాాజాగా ఎల్బీనగర్
నగర్ -
దిల్ షుక్
నగర్ ప్రధాన రహదారిపై అధిక వేగంతో , నిర్లక్ష్యంగా దూసుకవచ్చిన TS 13 UA 7633 కారు..
చైతన్య పురి యూ టర్న్ వద్ద రోడ్డు దాటుతున్న
రవి (50) ధన్ రాజ్(25) ఇద్దరిని ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి. ఢీకొట్టి పరారైన కారు , కారు నెంబర్ ద్వారా దర్యాప్తు చేపట్టిన సరూర్
నగర్ పోలీసులు. పోస్టుమార్టం నిమిత్తం
ఉస్మానియా ఆసుపత్రి కి తరలించిన పోలీసులు.