ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచాన్నే గడగడ లాడిస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా మన దేశంలో రోజు రోజుకి పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇప్పటికీ ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని లాక్ డౌన్ ను విధించింది. అయిన కానీ బాధితుల సంఖ్యలో ఏ మాత్రం మార్పు రాలేదు. సామాన్య ప్రజలు ఈ వైరస్ బారినపడి దిక్కు లేని వాళ్లైపోతున్నారు. ప్రస్తుతం ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా కర్ణాటక, ఢిల్లీ, మహారాష్ట్ర, ప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తుంది.


 అయితే దీనిని దృష్టిలో పెట్టుకొని తాజాగా అసోం ప్రభుత్వం కరోనాతో చనిపోయిన వారి కోసం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కష్ట కాలంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఆ రాష్ట్ర ప్రభుత్వం వారికి భరోసా కల్పిస్తోంది. కోవిడ్ బారిన పడి చనిపోయిన వారి అంత్యక్రియలకు ఖర్చులు భరించలేని కుటుంబాలకు రూ.5,000 చొప్పున ఆర్థిక సాయం ప్రకటించింది. నేషనల్ హెల్త్ మిషన్ నుంచి బాధిత కుటుంబాలకు ఈ సాయం అదిస్తామని అసోం ప్రభుత్వం జీవో జారీ చేసింది. కొవిడ్‌ తో చనిపోయిన వారి మృతదేహాలు అందకపోయినా, అంత్యక్రియల ఖర్చులు భరించలేకపోయినా రూ.5,000 వరకూ ఖర్చులు నిమిత్తం చెల్లించాలని నిర్ణయించినట్టు అసోం ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.ఇక మన రాష్ట్రంలో కరోనా విజృంభన ఇంకా కొనసాగుతుంది. యాక్టివ్ కేసులు చూస్తే ఇప్పటికే 29,690 కి చేరువైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: