ఈ నేపథ్యంలో ఇంటి ఓనర్ మహాలక్ష్మి శుక్రవారం రాత్రి వారిని నిలదీసింది. బాకీ ఉన్న నాలుగు నెలల అద్దె రూ.24 వేలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేసింది. తనకు ఇప్పుడే మరో ఉద్యోగం వచ్చిందని ఒక నెల ఆగండి చెల్లిస్తానని రవిచంద్ర కోరాడు. మహాలక్ష్మీ దాన్ని వినిపించుకుకోకపోవడం వల్ల తమ అడ్వాన్స్ నుంచి అద్దెను మినహాయించుకోవాలని ఆయన భార్య పూర్ణిమ చెప్పింది. అంతకు మించి తాము ఏమీ చేయలేమని చెప్పడం వల్ల ఆగ్రహించిన ఓనర్ వెంటనే కిచన్లోకి వెళ్లి కత్తిని తీసుకొచ్చి పూర్ణిమ చేయి, మెడపై పొడిచింది. ఇంతలో రవిచంద్ర ఆమెను అడ్డుకోవడం వల్ల అక్కడి నుంచి వెళ్లిపోయింది. దానితో బాధితుల జంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. హత్యాయత్నం కింద కేసు నమోదు చేసుకుని ఓనర్ మహాలక్ష్మిని అరెస్ట్ చేశారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి