షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 1న గ్రేటర్ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తామన్నారు. కరోనా వైరస్ కారణంగా పోలింగ్ సమయాన్ని ఓ గంటపాటు పెంచుతున్నామన్నారు. డిసెంబర్ 4వ తేదీన కౌంటింగ్ చేపట్టి ఫలితాల్ని ప్రకటించనున్నారు.
రేపట్నుంచి అంటే నవంబర్ 18 నుంచి నామినేషన్ల స్వీకరణ చేపడతామన్నారు. 18, 19, 20వ తేదీల్లో నామినేషన్లను స్వీకరిస్తామన్నారు. నవంబర్ 20న నామినేషన్లు దాఖలు చేసేందుకు చివరి రోజుగా నిర్ణయించారు. నవంబర్ 21న నామినేషన్లను పరిశీలించారు. నవంబర్ 22 న నామినేషన్ల ఉపసంహరణ చేసుకునేందుకు గడువు విధించారు. మరి తెలంగాణలో నిన్నటి వరకు ఉప ఎన్నికలతో హోర్రెతించిన రాజకీయ పార్టీలు ఇప్పుడు జిహెచ్ఎంసి ఎన్నికలకు సిద్దమవుతున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి