‘‘కెప్టెన్‌గా నేనైతే ఇలాంటి దానికి అంగీకరించను. నేను కనుక కెప్టెన్ అయితే, ఫీల్డింగ్ ప్లేస్‌మెంట్ మార్చేందుకో, బౌలింగ్ చేంజింగ్ గురించో చెప్పేందుకు 12వ ఆటగాడిని వాటర్ బాటిలో, మరోటో ఇచ్చి మైదానంలోకి పంపిస్తా. అలా మనం చెప్పాల్సింది చెప్పొచ్చు. లేదంటే బౌండరీ వద్ద ఉన్న ఫీల్డర్ ద్వారా కోచ్ ఆ సందేశాన్ని పంపొచ్చు’’ అని గవాస్కర్ పేర్కొన్నాడు. ఇలాంటి వ్యూహాలకు చెక్ పెట్టేందుకు ఐసీసీ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గవాస్కర్ అన్నాడు. ఇలాంటి విధానాన్ని ఐసీసీ అనుమతించినదీ, లేనిదీ తనకు తెలియదని, ఇప్పటి వరకు ఈ విషయం తమకు తెలియదని తెలిపాడు. తన క్రికెట్ కెరీర్‌లో తొలిసారి ఇలా చూస్తున్నానని, డీఆర్ఎస్ తీసుకునే విషయంలోనూ ఇలాంటి కోడ్ భాష ఉందా? అని గవాస్కర్ ప్రశ్నించాడు.
ఇదిలా ఉంటే ఈ విధంగా కోడ్ పరిభాషలో ఆటగాళ్లకు సూచనలు ఇవ్వడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది మొదట్లో పాకిస్థాన్ సూపర్ లీగ్‌లోనూ ఇలాంటి సంఘటనే జరిగింది. విశేషమేమంటే అక్కడ కూడా ఈ కోడ్ పరిభాషను ఉపయోగించింది లీమనే. పీఎస్ఎల్‌లో ముల్తాన్ సుల్తాన్స్ జట్టుతో ఉన్న లీమన్ ఓ కోడ్ పరిభాషనే ఉపయోగించి మైదానంలోని ఆటగాళ్లకు మెసేజ్ చేరవేశాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి