భారత్ లో కరోనా విలయ తాండవం కొనసాగుతూనే ఉంది. రోజుకు లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా దేశాలు భారత్ వైపు సరిహద్దులను మూసివేశాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా భారత్ నుంచి విమాన రాకపోకలను పూర్తిగా నిషేదించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆస్ట్రేలియా కాస్త వెనక్కి తగ్గి నిషేద ఆంక్షలను సడలించింది.

ఎందుకంటే భారత్ లో ఆస్ట్రేలియన్లు దాదాపుగా 9 వేల మందికి పైగానే ఉన్నట్లు అంచనా. దీంతో భారత్ లో చిక్కుకొని ఇబ్బందులు పడుతున్న వారిని తమ దేశానికి తీసుకొస్తామని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ తెలిపారు. దీంతో మే నెల మద్య నుండి భారత్ నుండి ఆస్ట్రేలియాకు విమానాలు నడిపే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఇక ఇప్పటి వరకు తమ దేశానికి తిరిగి వెళ్ళేందుకు 900 మంది రిజిస్టర్ చేసుకున్నట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: