త్రిపుర రాష్ట్రంలోని అంబస్సాలో కోవిడ్ కేర్ సెంటర్ నుంచి 25 మంది బాధితులు తప్పించుకొని పారిపోయారు. ఈ విషయం తెలుసుకున్న వైద్యాధికారులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. త్రిపుర అంబస్సా పంచాయతీరాజ్ శిక్షణ సంస్థ భవనంలో తాత్కాలికంగా కోవిడ్ కేర్ సెంటరును ఏర్పాటు చేసి అందులో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులను, కరోనా సోకిన వారిని ఉంచుతున్నారు. ఈ క్రమంలోనే కోవిడ్ కేర్ సెంటర్ నుంచి 25 మంది కరోనా రోగులు పారిపోవడంతో అన్ని పోలీసుస్టేషన్లు, రైల్వేస్టేషన్లకు సమాచారం అందించి వారిని అప్రమత్తం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు పారిపోయిన కోవిడ్ రోగుల కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఇందులో ఏడుగురిని రైల్వే స్టేషన్ వద్ద పట్టుకున్నారు. పంచాయతీ రాజ్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ లోని కొవిడ్ కేర్ సెంటర్ నుంచి పారిపోయిన రోగులందరూ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులు అని అంబస్సా పోలీస్ స్టేషన్ ఇన్ చార్జి హిమాద్రి సర్కార్ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: