ఇప్పటికే కరోనా సెకెండ్ వేవ్ తో అల్లాడుతున్న ప్రపంచానికి ఇప్పుడు థర్డ్ వేవ్ భయం పట్టుకుంది. ముఖ్యంగా బ్రిటన్ లో ఈ సంకేతాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని భారత సంతతి శాస్త్రవేత్త, ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రభుత్వ శాస్త్రీయ సలహాదారైన ప్రొఫెసర్ రవి గుప్తా హెచ్చరించారు. 


రోజూ వారీ కేసులు తక్కువగానే ఉన్నా, త్వరలో పరిస్థితి తీవ్రం అయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఇక జూన్ 21 నుంచి అక్కడ లాక్ డౌన్ ఆంక్షలు ఎత్తివేయాలని చూస్తున్నారని.. దీనివల్ల థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు ఆయన. ఇది థర్డ్ వేవ్ ప్రారంభానికి సూచికగా భావిస్తున్నట్లు చెప్పారు. అయితే వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరగడంతో కాస్త ఆలస్యంగానైనా థర్డ్ వేవ్ రాకుండా ఉండడానికి ప్రయత్నం చేయవచ్చని అన్నారు ఆయన.  

మరింత సమాచారం తెలుసుకోండి: