మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ రేపు త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గానికి వెళ్ల‌నున్నారు. ఢిల్లీ ప‌ర్య‌ట‌న త‌రువాత తొలిసారిగా నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించ‌నున్నారు ఈట‌ల రాజేంద‌ర్‌. నియోజ‌క‌వ‌ర్గంలోని క‌మాలాపూర్ మండ‌ల కేంద్రంలో రేపు ఈటల అనుచ‌రులు భారీ ర్యాలీ చేప‌ట్ట‌నున్నారు.కమలాపూర్ లోని పనగంట్ల నుండి బస్టాండ్,అంబేద్కర్ సెంటర్ మీదగా సబ్ స్టేషన్ వరకు ఈ ర్యాలీ సాగ‌నుంది. ఈటల త‌న సొంత గ్రామంలో  ఎలా స్పందిస్తాడో అని ఉత్కంఠంగా ఈటల అనుచరులు,అభిమానులు ఎద‌రుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: