వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సాధారణంగా ఏ సినిమాపై ప్రశంసలు కురిపించడు. వర్మ ఒక సినిమాపై గాని ఒక నటుడి పై గాని ప్రశంసలు కురిపించడం అంటే అందులో అంతో ఇంతో మ్యాటర్ ఉంటుంది. కాగా తాజాగా వర్మ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.... "ఫ్యామిలీ మ్యాన్ -2 ఒక వాస్తవిక జేమ్స్ బాండ్ లాంటింది. దాన్ని ఎప్పటికీ కొనసాగించవచ్చు.

ఫ్యామిలీ డ్రామా ను..యాక్షన్ మరియు వినోదాన్ని కలిపి చూపించడం చాలా కష్టం. అంతేకాకుండా వాస్తవికత మరియు నాటకీయత కేవలం మనోజ్ బాజ్ పాయ్ లాంటి నటుడు మాత్రమే చేయగలడు. " అంటూ వర్మ ప్రశంసలు కురిపించాడు. ఇదిలా ఉండగా ఈ వెబ్ సిరీస్ పై ఇప్పటికీ వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ సిరీస్ ను నిలిపివేయాలని తమిళులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: