ఈ మధ్యకాలంలో కరెంట్ బిల్లులు షాక్ కొట్టేలా వస్తున్నాయి. వాడినా వాడకపోయినా బిల్లులు మాత్రం చుక్కలు చూపిస్తున్నాయి. గతంలో ఓ ఇంటికి లక్షల్లో కరెంట్ బిల్లు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా హర్యానాలో ఓ రైస్ మిల్ నెలకు ఏకంగా రూ. 90 కోట్ల కరెంట్ బిల్లు వచ్చింది. లాక్ డౌన్ కారణంగా మిల్లు తెరుచుకోనప్పటికీ కరెంట్ బిల్ మాత్రం 90 కోట్లు వచ్చింది.

దీనిపై మిల్లు ఓనర్ మాట్లాడుతూ.... సాధారణంగా తమ మిల్లుకు నెలకు ఐదు నుండి ఆరు లక్షల కరెంట్ బిల్ వచ్చేదని చెప్పాడు. కానీ ఈనెల లాక్ డౌన్ కారణంగా తమ రైస్ మిల్ మూసి ఉన్నప్పటికీ 90 కోట్ల కరెంట్ బిల్లు వచ్చింది అన్నాడు. ఈ విషయంపై విద్యుత్ సబ్ డివిజనల్ ఆఫీసర్ రవికుమార్ మాట్లాడుతూ... సాఫ్ట్ వేర్ లోపం వల్ల 90 కోట్ల కరెంట్ బిల్లు వచ్చిందన్నారు. ఆన్లైన్ సక్రమంగా పని చేస్తే బిల్లు అప్డేట్ అవుతుంది అన్నారు. ఇక ఈ విషయం హర్యానాలో హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: