ఢిల్లీ ఎన్సీఆర్ లోని కొన్ని ప్రాంతాల్లో సోమవారం రాత్రి భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.7 నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకటించింది. అంతే కాకుండా హర్యానా లోని జజ్జర్ కు ఉత్తరాదిన పది కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టు అధికారులు గుర్తించారు. భూకంపం లోతు ఐదు కిలోమీటర్ల వరకు ఉంటుందని గుర్తించారు. ఇక ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు.

ఇదిలా ఉండగా ఆదివారం గుజరాత్ లోని కచ్ జిల్లాలో 3.7  తీవ్రతతో భూకంపం సంభవించింది. దూదై కి ఈశాన్యంగా 19 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం గుర్తించారు. 11.8 కిలోమీటర్ల లోతు ఉందని గాంధీనగర్ భూకంప పరిశోధన సంస్థ అధికారులు వెల్లడించారు. ఇక గత సంవత్సరం ఏప్రిల్, ఆగస్టు లో ఢిల్లీ ప్రాంతంలో అనేక భూకంపాలు సంభవించాయి. భూకంప కార్యకలాపాలను  పరిశీలించడానికి రికార్డింగ్ పరికరాలను ఏర్పాటు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: