జీఎస్టీ టాక్ : మీ అప్పు మేం తీర్చ‌లేం

లక్ష‌న్న‌ర కోట్ల అప్పు కేంద్రానికి అవ‌స‌రం అయింది.. అది కూడా జీఎస్టీ బ‌కాయిల‌ను రాష్ట్రాల‌కు చెల్లించే క్ర‌మంలో ఈ పాటి అప్పు త‌మ‌కు అత్య‌వ‌స‌రం అయి 43వ జీఎస్టీ కౌన్సిల్ అనుమ‌తితో తాము ఈ మేర‌కు కార్యాచ‌ర‌ణ‌కు సిద్ధం అవుతున్నామ‌ని చెబుతోంది. అంతేకాదు ఇప్ప‌టివ‌ర‌కూ తెలంగాణ‌కు రూ.6218 కోట్లు జీఎస్టీ బ‌కాయి చెల్లిం చామ‌ని కూడా చెప్పింది. అద్స‌రే మిగ‌తా బాకీ క‌థ ఏంటి?

రాష్ట్రం అప్పు వేరు..కేంద్రం రాష్ట్రానికి చెల్లించి తీరాల్సిన అప్పు వేరు..ఏదేమ‌యినా క‌రోనా పుణ్యాన అప్పు చేసి ప‌ప్పు కూడు కేం ద్రం,రాష్ట్రం చేయాల్సి వ‌స్తూనే ఉంది. ఈ త‌ రహా అప్పు తెలంగాణ‌కు కేంద్రం ఉంది. జీఎస్టీరూపంలో ఇవ్వాల్సింది కానీ ఇవ్వ‌లేమని చెబుతోంది. రూ. 4073 కోట్లు మేర‌కు రాష్ట్రంకు ఇవ్వాల్సి ఉన్నా ఇప్ప‌టికిప్పుడు ఇ వ్వాలంటే తాము కూడా అప్పు చేసే తీర్చాల్సి ఉంద‌ని ఇవాళ కేంద్రం రాజ్య‌స‌భ‌లో తేల్చేసింది. మొత్తానికి క‌రోనా రాక‌తో అటు కేంద్రం ద‌గ్గ‌ర, ఇటు రాష్ట్రం ద‌గ్గ‌ర పైస‌ల్లేవ‌ని తే లిపో యింది. జీఎస్టీ వ‌సూళ్లు ఆశాజ‌న‌కంగా ఉన్న రోజునే కేంద్రం రాష్ట్రాల‌కు ఇవ్వాల్సిన డ‌బ్బులు తిరిగి చెల్లించ‌లేక‌పోయింద‌ని, అలాం టిది అప్పు చేసి మ‌రీ జీఎస్టీ బ‌కాయి లు చెల్లించాల‌ని యోచిస్తున్నామ‌ని ఇందుకు 1.59ల‌క్ష‌ల కోట్ల అప్పు అవ‌స‌రం అవుతుంద‌ని కేంద్రం చెబుతోంది. ఏదేమ‌యినా అప్పువ‌డ్డ‌ది సుమీ భార‌తావ‌ని అన్న క‌వి మాటే నిజం మిగ‌తాదంతా అబ‌ద్ధం.


 

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr